ఆ విషయంలో సిగ్గు పడటం లేదు.. భారత టీ20 కెప్టెన్ సూర్య కీలక వ్యాఖ్యలు

by Harish |

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు.

ఆ విషయంలో సిగ్గు పడటం లేదు.. భారత టీ20 కెప్టెన్ సూర్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఇటీవల ఆసియా కప్‌లోనూ గొప్పగా రాణించలేదు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫామ్‌పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సూర్య కీలక వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా తాను ఎక్కువ పరుగులు చేయడం లేదని అంగీకరించాడు. వాస్తవాన్ని చెప్పడానికి తాను సిగ్గుపడటం లేదన్నాడు. అయితే, తన ఫామ్ వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగలేదని సమర్థించుకున్నాడు.

‘నిజం చెప్పడానికి సిగ్గుపడటం లేదు. ఆసియా కప్‌ను బాగానే ప్రారంభించా. పాక్‌తో గ్రూపు మ్యాచ్‌లో 47 రన్స్‌తో అజేయంగా నిలిచా. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో కూడా బాగానే ఆడా. కానీ, పరుగులు రాలేదు. నా ప్రిపరేషన్, ప్రక్రియ సరిగ్గా ఉంటే పరుగులు త్వరలో లేదా తర్వాతైనా వస్తాయని నాకు తెలుసు. నా ఫామ్ జట్టును ప్రభావితం చేస్తే దానిపై దృష్టి పెట్టేవాడిని. కానీ, జట్టు బాగుంది. టీమ్ వాతావరణం కూడా బాగుంది. నా ఫామ్ జట్టును ప్రభావితం చేయనివ్వను.’అని సూర్య చెప్పుకొచ్చాడు. సూర్య నేతృత్వంలో భారత జట్టు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సారథిగా ఆకట్టుకున్నా ప్లేయర్‌గా మాత్రం నిరాశపరిచాడు. 72 పరుగులే చేశాడు. కెప్టెన్‌గా మాత్రం గొప్ప రికార్డును కలిగి ఉన్నాడు. భారత్ అతని నాయకత్వంలో ఆడిన 29 మ్యాచ్‌ల్లో 25 మ్యాచ్‌ల్లో గెలిచింది.


Next Story