ఏ ఇండియన్ క్రికెటర్ ఆ పని చేయలేరు.. షాకిచ్చిన బీసీసీఐ

by Disha Web Desk 19 |
ఏ ఇండియన్ క్రికెటర్ ఆ పని చేయలేరు.. షాకిచ్చిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఐపీఎల్‌కు చెందిన వివిధ ప్రాంచైజ్‌లు విదేశీ టీ20 లీగుల్లో జట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఇండియన్ క్రికెటర్ అయిన అన్ని రకాల ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యే వరకు విదేశీ లీగ్‌లలో ఆడటం కానీ.. మెంటర్‌గా వ్యవహారించడం వంటివి చేయలేరని బీసీసీఐ తెలిపింది. ఏ ఆటగాడు అయినా విదేశీ లీగ్‌లలో పాల్గొనాలనుకుంటే.. బీసీసీఐతో అన్ని సంబంధాలను తెంచుకున్న తర్వాత మాత్రమే ఆ అవకాశం ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. దీంతో గతకొన్ని రోజులుగా భారత ప్లేయర్లు విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందని వినిపిస్తోన్న వార్తలకు తాజాగా చెక్ పడింది. విదేశీ లీగుల్లో ఆడాలనుకునే భారత ఆటగాళ్లకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ పాంటింగ్ భారత ఆటగాళ్లకు విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్‌కు చెందిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ప్రాంచైజ్‌లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లను కొనుగోలు చేశాయి.

టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్ అందుకే బ్రేక్..




Next Story

Most Viewed