అథ్లెట్లకు ఇకపై ఆ టెస్టు కంపల్సరీ

by Harish |

అథ్లెట్లలో పనితీరు, జవాబుదారీతనం పెంచే లక్ష్యంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అథ్లెట్లకు ఇకపై ఆ టెస్టు కంపల్సరీ
X

దిశ, స్పోర్ట్స్ : అథ్లెట్లలో పనితీరు, జవాబుదారీతనం పెంచే లక్ష్యంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌ సహా మేజర్ ఇంటర్నేషనల్ టోర్నీలకు ముందు అథ్లెట్లకు ఫిట్‌నెస్ టెస్టుల నిర్వహించాలని చూస్తున్నది. మేజర్ అంతర్జాతీయ ఈవెంట్లలో అథ్లెట్ల నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడానికి పూర్తి స్థాయి ఫిట్‌నెస్ లేకపోవడం కూడా ఓ కారణం. అథ్లెట్ల ఎంపిక ప్రక్రియ, టోర్నీలకు సంసిద్ధతపై క్రీడా మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికి ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అవడం తప్పనిసరి చేయాలని చూస్తున్నదని తెలిపాయి. ఫెయిల్ అయిన వారిపై చర్యలు కూడా చేపట్టనున్నట్టు చెప్పాయి. ‘ఒలింపిక్స్, ఆసియా గేమ్స్‌ లాంటి బిగ్ ఈవెంట్లలో పాల్గొన్న చాలా మంది అథ్లెట్లు పేలవ ప్రదర్శనకు కారణం 100 శాతం ఫిట్‌గా లేకపోవడమే అని చెప్పారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఇకపై మేజర్ టోర్నీలకు ముందు ఫిట్‌నెస్ టెస్టును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.’ అని సదరు వర్గాలు వెల్లడించాయి. ఫిట్‌నెస్ క్రీడలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. వైద్య, శిక్షణ నిపుణుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్ టెస్టులు జరుగుతాయి.


Next Story