- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ :టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు రావడానికి నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ మొండిపట్టు వీడటం లేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా తమ మ్యాచ్‌లను మరో ఆతిథ్య దేశమైన శ్రీలంకలో నిర్వహించాలని పట్టుబడుతోంది. ప్రపంచకప్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో వేదికలు మార్చడం అసాధ్యమని ఐసీసీ చెబుతోంది. ఈ క్రమంలోనే బుధవారం లోగా ప్రపంచకప్‌లో పాల్గొంటారో?లేదో? తేల్చుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి ఐసీసీ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బంగ్లా వైఖరిలో మార్పు లేదు. ప్రపంచకప్ విషయంలో తమ వైఖరిని మార్చుకోమని బంగ్లాదేశ్ ప్రభుత్వ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ ఒత్తిడికి ఐసీసీ తలొగ్గిందని ఆరోపించారు. అసమంజసమైన షరతులు తమ విధిస్తే తాము అంగీకరించబోమని తెలిపారు. ‘పాకిస్తాన్‌కు భారత్ వెళ్లడానికి నిరాకరిస్తే ఐసీసీ వేదిక మార్చింది. మేము కూడా అదే అడుగుతున్నాం. కాబట్టి, భారత్‌లో ఆడాలని మాపై ఒత్తిడి చేయొద్దు’అని నజ్రుల్ చెప్పుకొచ్చారు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లా మొండిపట్టు వీడకపోతే ప్రపంచకప్‌లో ఐసీసీ ఆ టీమ్ స్థానంలో స్కాట్లాండ్‌ను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.






