IND VS AUS: టీమిండియాకు షాక్‌.. టీ20 సిరీస్ నుంచి నితీష్ ఔట్‌

by velandi.Saikiran |   (  Updated:2025-10-29 08:48:09  IST  )

హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టుకు ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తాడనుకున్న తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆస్ట్రేలియాతో

IND VS AUS: టీమిండియాకు షాక్‌.. టీ20 సిరీస్ నుంచి నితీష్ ఔట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించిన టీమిండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలోనే సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ మూడో వన్డేలో గాయం బారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఐసీయూ వరకు పంపించాల్సి వచ్చింది. అయితే ఈ బాధలో ఉన్న టీమిండియా జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టుకు ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తాడనుకున్న తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆస్ట్రేలియాతో జరగబోయే టి20 లకు దూరం కాబోతున్నాడు.

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ్టి నుంచి 3 టీ20లు జరగనున్నాయి. ఈ మూడు టి20లకు నితీష్ కుమార్ రెడ్డి దూరం కానున్నాడు. మొన్న వన్డే సిరీస్ సందర్భంగానే ఎడమ క్వాడ్రిసెప్స్ బారిన పడ్డాడు నితీష్ కుమార్ రెడ్డి. అంటే నితీష్ కుమార్ రెడ్డి ఎడమ కండరాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య తీవ్రతరం కావడంతో అతన్ని టి20 నుంచి తప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు టి20లకు కూడా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇక అతని స్థానంలో శివమ్ దూబేను సూర్య కుమార్ యాదవ్ వాడుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే దూబేకు మొద‌టి టీ20లోని తుది జట్టులో అవకాశం కల్పించారు.

Next Story