- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్పత్రి బెడ్ పై స్టార్ ప్లేయర్.. టెన్షన్ లో కావ్య పాప !
నితీష్ కుమార్ రెడ్డికి తాజాగా సర్జరీ జరిగింది. అతనికి సర్జరీ అయిన నేపథ్యంలో.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ( Kavya Maran) చాలా టెన్షన్ పడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) .. ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి టీమిండియా స్టార్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి తాజాగా సర్జరీ జరిగింది. అతనికి సర్జరీ అయిన నేపథ్యంలో.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ( Kavya Maran) చాలా టెన్షన్ పడుతున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ ప్రారంభ సమయంలో... నితీష్ కుమార్ రెడ్డి జిమ్ లో చాలా కసరత్తులు చేశాడు. ఈ తరుణంలోనే అతని కాలికి గాయమైంది. దీంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే అతనికి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కాలుకు సర్జరీ జరిగినట్లు నితీష్ కుమార్.... కూడా పోస్ట్ పెట్టాడు.
అయితే ఆ పోస్ట్ వైరల్ కావడంతో...SRH జట్టు ఓనర్ కావ్య కాస్త టెన్షన్ పడుతున్నారట. అతడు వచ్చే సీజన్ ఐపీఎల్ 2026 ఆడతాడా? ఆలోపు ఫిట్నెస్ అందుకుంటాడా? అని టెన్షన్ పడుతున్నారట కావ్య మారాన్. హైదరాబాద్ జట్టులో బౌలింగ్ అలాగే బ్యాటింగ్లో అద్భుతంగా రాణించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే టీం ఇండియాకు కూడా సెలెక్ట్ అయ్యాడు. అలాంటి ప్లేయర్ జట్టుకు దూరం అవుతే ఖచ్చితంగా టెన్షన్ పడాల్సిందే. ఇప్పుడు కావ్య మారాన్ కు అదే పరిస్థితి నెలకొంది.






