గంభీర్ ఒక్క‌డే కాదు, నితీష్ కుమార్ కెరీర్ కూడా క్లోజ్ !

by velandi.Saikiran |

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అందరూ గౌతమ్ గంభీర్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

గంభీర్ ఒక్క‌డే కాదు, నితీష్ కుమార్ కెరీర్ కూడా క్లోజ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa ) మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అందరూ గౌతమ్ గంభీర్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ను (Gautam Gambhir) ఉద్దేశించి, బండ బూతులు తిడుతూ అభిమానులందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ గ్యాప్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎస్కేప్ అవుతున్నాడు. వాస్తవంగా ఫేయిల్ అయింది తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. అత‌నిపైన ఎంతో నమ్మకం పెట్టి, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టుకు సెలెక్ట్ చేసింది బీసీసీఐ. కానీ తన ఆల్ రౌండ‌ర్‌ ప్రతిభను ఇప్పటి వరకు ఎక్కడా ప్రదర్శించ లేదు నితీష్ కుమార్ రెడ్డి.

బ్యాటింగ్ కాకపోయినా బౌలింగ్ లో అయినా రాణిస్తే బాగుండు. ఎక్క‌డా కూడా పేల‌లేదు. ముఖ్యంగా బ్యాటింగ్ లో చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అప్పట్లో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన తర్వాత 10 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి వచ్చింది. ఇందులో 1,0,4,1,1, 30,13,43,10,0 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మొత్తం పది ఇన్నింగ్స్ లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy).

ఈ లెక్కలు చూస్తే మనకు నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరు ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పైన జరిగిన రెండు టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో పది పరుగులు చేసిన ఈ వీరుడు, రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. కష్టాల్లో ఉన్న టీం ఇండియాను ఆదుకోలేకపోయాడు. సర్లే బ్యాటింగ్ దొబ్బింది అనుకుంటే, బౌలింగ్ లో అయినా రాణిస్తే బాగుండు. ఇందులో కూడా పెద్దగా ఆట తీరు కనబరచడం లేదు. తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరో రెండు పాయింట్లు కోల్పోయి 64 ర్యాంకుకు ప‌డిపోయాడు.

Next Story