CSK : ధోని కోసం ఆ ఇద్దరినీ బలి చేశారా ?

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టు కీలక

CSK : ధోని కోసం ఆ ఇద్దరినీ బలి చేశారా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) స్థానంలో మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni) కి మరోసారి అవకాశం ఇచ్చింది ఆ జట్టు యాజమాన్యం. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) కు గాయం అయింది. తన మోచేతికి తీవ్రమైన గాయం కావడంతో... ఈ సీజన్ మొత్తం దూరం కాబోతున్నాడు.


దీంతో మహేంద్ర సింగ్ ధోనీని మరోసారి కెప్టెన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రకటన చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే తదుపరి మ్యాచ్ లకు.. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మహేందర్ సింగ్ ధోని కెప్టెన్ గా కొనసాగుతాడు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. 2022 ఐపీఎల్ సమయంలో అచ్చం ఇలాగే జడేజాకు అన్యాయం జరిగిందని కొంత మంది అంటున్నారు.

ఆ సమయంలో చెన్నై కెప్టెన్ గా జడేజాకు అవకాశం ఇచ్చింది యాజమాన్యం. కానీ జట్టు ఆట తీరు సరిగ్గా లేకపోవడంతో అతనిపై వేటువేసి మళ్లీ ధోనికి అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా గాయం పేరుతో రుతురాజ్ గైక్వాడ్ ను పక్కకు జరిపి... మహేంద్ర సింగ్ ధోనికే ఛాన్స్ ఇస్తున్నారు. ఈ తరుణంలోనే మహేంద్ర సింగ్ ధోని కోసం ఇద్దరి లైఫ్ నాశనం చేశారని కొంత మంది మహేంద్ర సింగ్ ధోనీ వ్యతిరేకులు ట్రోలింగ్ చేస్తున్నారు.

Next Story