VIRAL: మెస్సీ కోసం హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త పెళ్లికూతురు

by Ajay Maddhiboyina |

ఫుట్ బాల్ దిగ్గజం, ప్రపంచకప్ విజేత భారత పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. మెస్సీ నేడు తెల్లవారుజామున కోల్ కతాలో అడుగుపెట్టాడు.

VIRAL: మెస్సీ కోసం హనీమూన్ వాయిదా వేసుకున్న కొత్త పెళ్లికూతురు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫుట్ బాల్ దిగ్గజం, ప్రపంచకప్ విజేత భారత పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. మెస్సీ నేడు తెల్లవారుజామున కోల్ కతాలో అడుగుపెట్టాడు. గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ లో భాగంగా మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నాడు. తన మెస్సీ భారత్ లో అడుగుపెట్టడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. అర్ధరాత్రి అయినా వేలాది మంది ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. కాగా ఆ సమయంలో ఓ కొత్త పెళ్లికూతురు ప్లకార్డు ప్రదర్శించగా అది అందర్నీ ఆకర్షించింది. ప్లకార్డులో నాకు గత శుక్రవారమే పెళ్లయింది.

కానీ మెస్సీని చూడటం కోసం హనీమూన్ రద్దు చేసుకున్నా అని రాసి ఉంది. ఇక ఆ నూతన వధువు మీడియాతో మాట్లాడుతూ.. తాను 2010 నుండి మెస్సీకి వీరాభిమాని అని చెప్పింది. మెస్సీ వస్తున్నాడని తన భర్తతో మాట్లాడి హనీమూన్ సైతం వాయిదా వేసుకున్నట్టు తెలిపింది. 2011లో మెస్సీ వచ్చినప్పుడు చూసే అవకాశం రాలేదని అప్పుడు చిన్నవాళ్లమని చెప్పింది. ఇప్పుడు ఛాన్స్ వదులుకోలేమని తెలిపింది. ఇక 2011లో మెస్సీ కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత హైదరాబాద్ వస్తుండటంతో అభిమానులు చూసేందుకు ఎగబడుతున్నారు. వీడియో

Next Story