న్యూజిలాండ్ గ్రాండ్ విక్ట‌రీ..టోర్న‌మెంట్ నుంచి శ్రీలంక ఔట్

by velandi.Saikiran |   (  Updated:2026-02-25 17:38:24  IST  )

T20 ప్రపంచ కప్ సూపర్ 8 లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఆతిథ్య శ్రీలంక టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

న్యూజిలాండ్ గ్రాండ్ విక్ట‌రీ..టోర్న‌మెంట్ నుంచి శ్రీలంక ఔట్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయింది. తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్ లో చెత్త ప్రదర్శన కనబరిచి, దారుణంగా ఓడిపోయింది శ్రీలంక. న్యూజిలాండ్, శ్రీలంక మధ్య బుధవారం సూపర్ 8 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంకపై 61 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను పెంచుకున్న న్యూజిలాండ్, శ్రీలంకను టోర్నమెంట్ నుంచి పంపించేసింది.

సూపర్ 8లో వరుసగా శ్రీలంక రెండు ఓటములను చవి చూసింది. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి ఆతిధ్య శ్రీలంక ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పటికే ఈ గ్రూపులో ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ కు క్వాలిఫై అయింది. రెండవ స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఇందులో దాదాపు పాకిస్తాన్ కూడా ఇంటి దారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా మిరాకిల్ జ‌రిగితే త‌ప్ప‌, పాకిస్తాన్ కు ఛాన్స్ లేదు.

61 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య మంగళవారం కీలక మ్యాచ్ జరిగింది. ప్రేమ దాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది న్యూజిలాండ్. ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ పెద్దగా రాణించకపోయిన, మహేంద్ర సింగ్ ధోనీ లాగా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 47 పరుగులతో రాణించాడు. మిచెల్ సాంట్నర్ చేసిన పరుగులే న్యూజిలాండ్ ను గెలిపించాయని చెప్పవచ్చు. న్యూజిలాండ్ విధించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక చేతులెత్తేసింది. మొదటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది శ్రీలంక. సొంత గడ్డ అయినప్పటికీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేసింది.

దీంతో న్యూజిలాండ్ చేతిలో 61 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది శ్రీలంక. ఈ ఓట‌మితో టీ20 వరల్డ్ కప్ టోర్న‌మెంట్ నుంచే ఆతిథ్య శ్రీలంక ఇంటి దారి ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఇక ఈ సూప‌ర్ 8 లో త‌న చివ‌రి మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడ‌నుంది శ్రీలంక‌. ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్ లో రచిన్ రవీంద్ర అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు రచిన్ రవీంద్ర. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన రచిన్ రవీంద్ర, తన వంతు పరుగులు న్యూజిలాండ్ జట్టుకు అందించాడు. ఇందులో 22 బంతులు ఆడిన రచిన్, 32 పరుగులు సాధించాడు. అటు బౌలింగ్ కూడా ఇరగదీశాడు. నాలుగు ఓవర్లు సంధించిన రచిన్ రవీంద్ర, 27 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద అవార్డు దక్కించుకున్నాడు.

Next Story