- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. 42 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్
వన్డేల్లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ అపూర్వ సిరీస్ విజయాన్ని అందుకుంది.

దిశ, స్పోర్ట్స్ : వన్డేల్లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ అపూర్వ సిరీస్ విజయాన్ని అందుకుంది. 42 ఏళ్ల తర్వాత ఇంగ్లిస్ జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడో వన్డేలోనూ నెగ్గి 3-0 సిరీస్ సొంతం చేసుకుంది. 1983లో ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్(3-0) క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ 42 ఏళ్ల తర్వాత మళ్లీ వైట్‌వాష్ చేసింది. ప్రస్తుత వన్డే సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన కివీస్ ఆఖరి వన్డేలోనూ అదే జోరు కొనసాగించింది. ముందుగా ఇంగ్లాండ్‌ను 40.2 ఓవర్లలోనే 222 పరుగులకే ఆలౌట్ చేసింది. కివీస్ బౌలర్లు టిక్నెర్ 4 వికెట్లు, జాకబ్ డఫీ 3 వికెట్లతో విజృంభించారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు విలవిలలాడిపోయింది. అయితే, ఆ జట్టులో జేమీ ఓవర్టన్(68) ఒక్కడే రాణించాడు. పోరాట పటిమ కనబరిచాడు. బట్లర్(38), బ్రైడెన్ కార్సే(36) పర్వాలేదనిపించగా.. జేమీ స్మిత్(5), డక్కెట్(8), రూట్(2), బ్రూక్(6), జాకబ్ బెథెల్(11) తేలిపోయారు.మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కాస్త శ్రమించినప్పటికీ చివరికి 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(46), మిచెల్(44), కాన్వే(34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.






