- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20WorldCup2026: తడబడ్డ న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా కొలంబోని ప్రేమదాస మైదానం వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026), సూపర్-8లో భాగంగా కొలంబోని ప్రేమదాస మైదానం వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్(England vs New Zealand) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. గ్లెన్ ఫిలిప్స్(39), సైఫెర్ట్(35), ఫిన్ అలెన్(29) తప్ప ఎవరూ పెద్దగా రాణించలేదు. రచిన్ రవీంద్ర(11), చాప్‌మన్(15), డారీ మిచెల్(03) ఇలా కీలక బ్యాట్‌మెన్‌లంతా స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరారు. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 159 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషిద్, విల్ జాక్స్, అహ్మద్ తలో రెండేసి వికెట్లు తీయగా, లియామ్ ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 160 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు చేరడం కష్టతరంగా మారుతుంది. తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడితే.. న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్లడం సునాయాసం అవుతుంది.






