- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ, రోహిత్ వరుస సెంచరీలు.. గంభీర్ కు కొత్త టెన్షన్!
గౌతమ్ గంభీర్ కు కొత్త టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాగే ఫామ్ కొనసాగిస్తే, గంభీర్

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు అదరగొడుతున్నారు. మొన్నటి వరకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో చెలరేగిపోయి ఆడారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2025 టోర్నమెంటులో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. నిన్న ప్రారంభమైన ఈ టోర్నమెంటులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయారు. వీళ్ళు సెంచరీ చేయడమే కాకుండా తమ జట్లను విజయతీరాలకు చేర్చుతున్నారు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ లో ROKO రంగంలోకి దిగుతారని పోస్టులు పెడుతున్నారు.
అదే సమయంలో గౌతమ్ గంభీర్ కు కొత్త టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాగే ఫామ్ కొనసాగిస్తే, గంభీర్ ఆటలు వన్డేల్లో అస్సలు సాగవు. వాళ్ళిద్దరిని తొలగించాలన్న ప్లాన్ వర్కౌట్ కాదు. ఇక సీనియర్ క్రికెటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా వన్డే జట్టులో ఉంటే, కుర్రాళ్ళు ఎవరు కూడా గౌతమ్ గంభీర్ మాట వినరు. అంతేకాదు వన్డేల్లో బ్యాటింగ్ లైనప్ మార్చే అంత ధైర్యం గంభీర్ చేయడు. ఒకవేళ చేస్తే, గంభీర్ పై రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ కాస్త టెన్షన్ పడుతున్నారట.






