పాకిస్థాన్ క్రికెట్‌లో కొత్త వివాదం: మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-05 06:29:17  IST  )

శ్రీలంక హోటల్ సిబ్బందితో అసభ్య ప్రవర్తన ఆరోపణలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చిక్కుల్లో. క్రమశిక్షణ ఉల్లంఘించిన కీలక ఆటగాడిపై విచారణ చేపట్టిన బోర్డు భారీ జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.

పాకిస్థాన్ క్రికెట్‌లో కొత్త వివాదం: మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup) జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టులో క్రమశిక్షణారాహిత్యం మరోసారి బయటపడింది. శ్రీలంక (Srilanka)లోని ఒక ప్రముఖ హోటల్‌లో బస చేస్తున్న సమయంలో జట్టుకు చెందిన ఒక కీలక ఆటగాడు అక్కడి మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినట్లుగా జాతీయ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విచారణ చేపట్టాయి. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను సదరు ఆటగాడికి భారీగా జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ ఆటగాడి పేరును బోర్డు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రపంచకప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీ జరుగుతున్న వేళ ఇలాంటి ఘటనలు జరగడం పాక్ జట్టు నైతికతపై ప్రభావం చూపుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న పాక్‌ను ఈ వివాదం ప్రపంచం ఎదుట తలెత్తుకోలేకుండా చేసింది.

Next Story