- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > మరోసారి అదరగొట్టిన నీరజ్ చోప్రా.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ఎంట్రీ
మరోసారి అదరగొట్టిన నీరజ్ చోప్రా.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ఎంట్రీ
by Kema Shiva Kumar |
భారత ప్రఖ్యాత జావెలిన్ త్రో దిగ్గజం నీరజ్ చోప్రా అదరగొడుతున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రఖ్యాత జావెలిన్ త్రో దిగ్గజం నీరజ్ చోప్రా అదరగొడుతున్నాడు. ఈ మేరకు అతడు తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (World Athletics Championships)లో ఫైనల్‌లోకి అడుగు పెట్టాడు. ఇవాళ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లోనే బళ్లాన్ని 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. ఇక పోలండ్ అథ్లెట్ డేవిడ్ వెంగెర్ తొలి రెండు ప్రయత్నాల్లో (79.72 మీ, 73.97 మీ)తో కాస్త వెనకబడ్డాడు. అతడు తన మూడో అటెంప్ట్‌లో 85.67 మీటర్లు విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు. అదేవిధంగా జర్మన్ అథ్లెట్ జులియన్ వెబర్ తొలి ప్రయత్నంలో (82.29 మీ) విసరగా.. రెండో ప్రయత్నంలో (87.21 మీ) త్రోతో ఫైనల్‌లో అడుగు పెట్టాడు. ఇక ఫైనల్ పోరు గురువారం జరగనుంది.
Next Story






