- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత రెజ్లర్ల పోరాటానికి మద్దతు తెలిపిన నవ్యజ్యోత్‌సింగ్ సిద్ధూ
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన దీక్ష చేపట్టారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన దీక్ష చేపట్టారు. కాగా, రెజ్లర్లు చేపట్టిన దీక్ష సోమవారానికి వారం రోజులకు చేరుకుంది. ఇదిలా ఉంటే, భారత రెజ్లర్ల నిరసనకు కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మద్దతు తెలిపారు. సోమవారం రెజ్లర్లతో కలిసి నిరసన దీక్షలో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిద్ధూ డిమాండ్ చేశారు. ఇక, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్ సింగ్ లైంగికంగా వేధించాడని భారత మహిళ రెజ్లర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
Next Story






