- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: ఆర్సీబీ ఆడే కొత్త వేదికలు ఇవే..షాక్ లో ఫ్యాన్స్ !
ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్ లు నవీ ముంబై, రాయ్‌పూర్ వేదికగా ఆడనుందని సమాచారం అందుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. అందరూ ఊహించినట్లుగానే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్ లు ఆడేలా కనిపించడం లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్ లు నవీ ముంబై, రాయ్‌పూర్ వేదికగా ఆడనుందని సమాచారం అందుతోంది. ఈ మేరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. చిన్న స్వామి స్టేడియం దగ్గర గతేడాది తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియంలో ఆడకూడదని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. దీంతో నవీ ముంబై, రాయ్‌పూర్ వేదికలను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తోందట.
ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం ఎప్పుడంటే ?
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయిన సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుందట. మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. ముందుగా మార్చి 15వ తేదీ నుంచి టోర్నమెంట్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, మార్చి 25వ తేదీకి మార్చారు.






