- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్... పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో అరుదైన సంఘటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్ కింగ్స్ (

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) మధ్య జైపూర్ ( Sawai Mansingh Stadium, Jaipur ) వేదికగా ఇవాళ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు ఓ అరుదైన సంఘటన జరిగింది.
ఆపరేషన్ సిందూర్ లో ( Operation Sindoor ) భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఇండియన్స్ కు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు ఇరుజట్ల ప్లేయర్లు మౌనం పాటించారు. అలాగే.. జాతీయ గీతం పాడి... దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఆర్మీకి నివాళులు అర్పించారు. అదే సమయంలో... స్టేడియం కు వచ్చిన క్రీడా అభిమానులు కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో... దాదాపు పది మంది వరకు ఇండియన్ ఆర్మీ సభ్యులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు సామాన్య ప్రజలు కూడా మరణించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నిన్నటి నుంచి పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Before the start of the match, the national anthem was sung to honor the victory of the Indian 🇮🇳 Armed Forces during Operation Sindoor
— Richard Kettleborough (@RichKettle07) May 18, 2025
- Great work by the BCCI 🫡 pic.twitter.com/xwWBveB6WU






