- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేవిస్ కప్ లోకి.. నగాల్ రీ ఎంట్రీ.!
భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ మళ్లీ డేవిస్ కప్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ మళ్లీ డేవిస్ కప్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే నెల 14, 15 న వరల్డ్ గ్రూప్ -1 లో భాగంగా.. స్వీడన్ తో జరిగే మ్యాచ్ లకు అతను అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల పాకిస్థాన్ తో గ్రాస్ కోర్టుపై జరిగిన మ్యాచ్ లకు సుమిత్ నగాల్ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు హార్డ్ కోర్టు పై పోటీలు కావడంతో మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. కాగా యూకీ బాంబ్రీ ఈ మ్యాచ్ ల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. జట్టులోని మిగతా సభ్యులు రామనాథన్, నిక్కీ పూనచ, శ్రీరామ్ బాలాజీ ఉన్నారు, రిజర్వ్ ప్లేయర్ గా ఆర్యన్ షా ఉన్నాడు. దీనికి కొత్త కోచ్ గా మాజీ నేషనల్ ఛాంపియన్ సిద్దార్థ్ విశ్వకర్మ వ్యవహరించనున్నాడు. యూకీ అందుబాటులో లేకపోవడంతో రాంకుమార్ రామనాథన్ ను సింగిల్స్ మరియు డబుల్స్ లోను ఆడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి అందుబాటులో ఉండే ప్లేయర్లతో ఒక మంచి టీమ్ ను ఏర్పాటు చేస్తామని సెలక్షన్ కమిటీ చైర్మన్ నందన్ బాలా తెలిపారు.






