సెంచరీతో మెరిసిన ముత్తుస్వామి.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా

by Malleboina Mahesh |

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్లు పట్టు బిగించారు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.

సెంచరీతో మెరిసిన ముత్తుస్వామి.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు (Second Test)లో సౌతాఫ్రికా బ్యాటర్లు పట్టు బిగించారు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా (South Africa) బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో మొదటి రోజు 6 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు రెండో రోజు కూడా నిలకడగా రాణించింది. సీనురాన్ ముత్తుస్వామి 107 పరుగులతో రెచ్చిపోయాడు. అలాగే మార్కొ జెన్‌సెన్ 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా జట్టు 7 వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది.

అంతకుముందు మార్క్రమ్ 38, రికల్టన్ 35, స్టబ్స్ 49, భవుమా 41, కైల్ వెరెన్ 45 పరుగులతో రాణించారు. రెండో రోజు ఆటలో మరో 35 ఓవర్లు మిగిలి ఉన్నాయి. మరి భారత బౌలర్లు (Indian bowlers) సౌతాఫ్రికాను ఆలౌట్ చేస్తారా.. లేఖ భారీ స్కోరు నమోదు తర్వాత సౌతాఫ్రికానే డిక్లేర్ చేస్తుందా తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే. ఈ మ్యాచులో భారత బౌలర్లలో బుమ్రా, సిరజ్ ఒక్కో వికెట్ తీసుకోగా.. కుల్దీప్ యాదవ్ 3, రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టారు.

Next Story