- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
లక్నోలోని ఏక్నా స్టేడియంలో గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టేబుల్‌లో 2వ స్థానానికి చేరుకుంది.

- యూపీని కట్టడి చేసిన అమిలియా
- ఛేజింగ్‌లో రాణించిన హెన్రీ మాథ్యూస్
- యూపీకి వరుసగా మూడో ఓటమి
- టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమణ
దిశ, స్పోర్ట్స్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్‌కు మరో పరాజయం ఎదురైంది. టోర్నీలో కొనసాగాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ చేతులెత్తేసింది. లక్నోలోని ఏక్నా స్టేడియంలో గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టేబుల్‌లో 2వ స్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో యూపీ వారియర్స్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూపీ వారియర్స్ నిర్దేశించిన 151 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ అమిలియా కెర్ (10) తక్కువ పరుగులకే పెవీలియన్ చేరింది. ఆ తర్వాత వచ్చిన నాట్ షివర్ బ్రంట్‌తో కొలసి మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ దూకుడుగా ఆడింది. బౌండరీలు, సిక్సులతో యూపీ బౌలర్లపై విరుచుకపడ్డారు. వీరిద్దరూ చెత్త బంతులను బౌండరీలకు పంపుతూ, అవసరమైన చోట స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూకలసి రెండో వికెట్‌కు 92 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అయితే దూకుడుగా ఆడుతున్న నాట్ షివర్ బ్రంట్ (37) గ్రేస్ హ్యారీస్ బౌలింగ్‌లో దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. దూకుడుగా ఆడే క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హేలీ మాథ్యూస్ (68)ను క్రాంతి గౌడ్ పెవీలియన్ చేర్చింది. ఆ తర్వాత వచ్చి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (4) బ్యాటింగ్‌లో విఫలమైంది. అయితే అమన్‌జోత్ కౌర్ (12), యాస్తికా భాటియా (10) మరో వికెట్ పడకుండా ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ముంబై జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో 153 పరుగులు చేసింది. గ్రేస్ హారీస్ 2 వికెట్లు తీయగా, హెన్రీ, క్రాంతి గౌడ్ తలా ఒక వికెట్ తీశారు. ముంబై బ్యాటర్ హేలీ మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తడబడిన యూపీ..
అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్‌లో ఓపెనర్లు తప్ప మిగిలిన బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు గ్రేస్ హ్యారీస్, జార్జియా వోల్ కలిసి యూపీ వారియర్స్‌కు శుభారంభన్ని అందించారు. వీరిద్దరు ముంబై బౌలర్లపై బౌండరీలతో దాడి చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలసి 74 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న గ్రేస్ హ్యారిస్ (28) హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో కమలినికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యింది. ఆ వెంటనే కిరన్ నవ్‌గిరే (0) డౌకౌట్ అయ్యింది. ఇక ప్రమాదకరంగా మారుతున్న జార్జియా వోల్ (55) నాట్ షివర్ బ్రంట్ బౌలింగ్‌లో పెవీలియన్ చేరింది. ఓపెర్లు ఇద్దరూ అవుటయ్యాక యూపీ వారియర్స్ పరుగుల వేగం తగ్గిపోయింది. కెప్టెన్ దీప్తి శర్మ (27), వృందా గణేష్ (10) తక్కువ పరుగులకే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన చినెల్లే హెన్రీ (6), శ్వేతా షెరావత్ (0), ఉపా చెత్రీ (1) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (16) కాస్త పర్వేలేదనిపించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో యూపీ వారియర్స్ 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. అమెలియా కెర్ 5, హెలీ మాథ్యూస్ 2 వికెట్లు తీయగా.. నాట్ షివర్ బ్రంట్, పరూనికా సిసోడియాకు చెరో వికెట్ లభించింది.
సంక్షిప్త స్కోర్ బోర్డు :
యూపీ వారియర్స్ ఉమెన్: 150/9 (జార్జియా వోల్ 55, గ్రేస్ హ్యారీస్ 28, అమెలియా కెర్ 5 వికెట్లు)
ముంబై ఇండియన్స్ ఉమెన్ : 153/4 ( హెలీ మాథ్యూస్ 68, నాట్ షివర్ బ్రంట్ 37, గ్రేస్ హ్యారీస్ 2 వికెట్లు)






