- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేకేఆర్ తో ఫైట్.. ఇకనైనా ముంబై పుంజుకుంటుందా ?
: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Mumbai Indians vs Kolkata Knight Riders ) జట్ల మధ్య ఇవాళ కీలక ఫైట్ ఉండనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో... ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు.. ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్ లో ( Jio Hot Star)... ఈ మ్యాచ్ ప్రసారాలు చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఐపీఎల్ మ్యాచ్ లు వస్తున్నాయి.
ముంబై వర్సెస్ కేకేఆర్ బలాబలాలు
ముంబై వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ముంబై ఇండియన్స్ పై చేయి సాధించింది. రెండు జట్ల మధ్య 34 మ్యాచులు జరుగుతే... 23 మ్యాచ్లలో... ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేకేఆర్ మాత్రం 11 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. గతంలో ముంబై ఇండియన్స్ చాలా బలంగా ఉండేది. ఎప్పుడైతే రోహిత్ శర్మను పక్కకు పెట్టి హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చారో... అప్పటినుంచి ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. పాయింట్స్ టేబుల్ లో చిట్టచివరన ఉంటుంది. ఈ సీజన్ లో కూడా... అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఇవాళ్టి మ్యాచ్ ముంబైలో జరుగుతున్న నేపథ్యంలో... హార్దిక్ పాండ్యా సేనకు అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది.






