- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026లో వరుసగా మూడు ఓటములు చెందిన చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్. వచ్చే మ్యాచ్‌కు ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. పిక్క కండరాల గాయంతో ధోనీ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అతను రెండు వారాలపాటు అందుబాటులో ఉండడని సీఎస్కే ఆరంభంలోనే తెలిపింది. అయినప్పటికీ అతను ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. అయితే, అతని విషయంలో రిస్క్ తీసుకోవద్దని ఫ్రాంచైజీ భావిస్తోంది. వచ్చే రెండు రోజుల్లో అతనికి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించనున్నట్టు సమాచారం. అందులో ఫిట్‌గా తేలితే ఈ నెల 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్ ధోనీ ఆడటం ఖాయమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న జట్టుకు ధోనీ రాక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే, సౌతాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ కూడా పక్కెటెముకల గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను కూడా ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. ‘వచ్చే గేముకు బ్రెవిస్ సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నాం. మాకు ఇంకా ఐదు రోజుల గ్యాప్ ఉంది. అతను ఆడతాడనే అనుకుంటున్నాం.’అని ఫ్లెమింగ్ తెలిపాడు.






