ఐపీఎల్-2026పై ధోనీ కీలక వ్యాఖ్యలు.. వచ్చే సీజన్ ఆడతాడా?లేదా?

by Harish |

ఆడినా ఆడకపోయినా తానెప్పుడు చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే)తోనే ఉంటానని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తెలిపాడు.

ఐపీఎల్-2026పై ధోనీ కీలక వ్యాఖ్యలు.. వచ్చే సీజన్ ఆడతాడా?లేదా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆడినా ఆడకపోయినా తానెప్పుడు చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే)తోనే ఉంటానని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ తెలిపాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ధోనీ.. వచ్చే సీజన్ ఆడటంపై సస్పెన్స్‌ను కొనసాగించాడు. వచ్చే సీజన్ ఆడటంపై నిర్ణయం తీసుకోవడం చాలా సమయం ఉందన్నాడు. అలాగే, సీఎస్కేతో అనుబంధం గురించి స్పందించాడు. ‘మళ్లీ ఎల్లో జెర్సీతోనే వస్తారా? అని అడిగితే మాత్రం నేను ఎప్పుడూ సీఎస్కేతోనే ఉంటా. నేను ఆడతానా?లేదా? అనేది వేరే విషయం. నేను, సీఎస్కే కలిసే ఉంటా. అది వచ్చే 15 లేదా 20 ఏళ్లైనా సరే. సీఎస్కేతో నా అనుబంధం పెరుగుతూ వచ్చింది. అది ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎదగడానికి ఉపయోగపడింది.’అని ధోనీ తెలిపాడు. అలాగే, గత రెండు సీజన్లలో సీఎస్కే వైఫల్యాన్ని ధోనీ అంగీకరించాడు. రెండేళ్లుగా తాము గొప్పగా ఆడలేదని, అత్యుత్తమ మార్క్‌ను అందుకోలేకపోయామన్నాడు. తాము ఎక్కడ తప్పు చేశామో అనే విషయాలను విశ్లేషించుకుంటున్నామని చెప్పాడు.


Next Story