ధోనీ నన్ను ఊసరవెల్లిగా మార్చాడు : దినేశ్ కార్తీక్

by Harish |   (  Updated:2025-09-09 15:35:44  IST  )

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ధోనీ నన్ను ఊసరవెల్లిగా మార్చాడు : దినేశ్ కార్తీక్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వల్ల తాను ఊసరవెల్లిగా మారానంటూ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ధోనీ తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపించాడో వివరించాడు. వికెట్ కీపర్‌గా ధోనీ సక్సెస్ కావడంతో జట్టులో స్థానం కోసం విభిన్నమైన పాత్రలు పోషించాల్సి వచ్చిందన్నాడు. ‘అప్పుడు ద్రవిడ్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ఆ సమయానికి వికెట్ కీపింగ్‌ను కొనసాగించే స్థితిలో లేడు. ‘బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. వికెట్ కీపింగ్‌కు నా శరీరం కష్టపడుతోంది.’అని చెప్పాడు. దీంతో జట్టు సరైన వికెట్ కీపర్ కోసం చూస్తోంది. నేను మూవీలో అతిథి పాత్రలాగా కొన్ని రోజులే ఉన్నాను. లీడ్ రోల్ ఎప్పుడూ ధోనీదే. అతను కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తన ఆటతో ఆకట్టుకున్నాడు.’అని కార్తీక్ తెలిపాడు.

ధోనీ రాకతో జట్టులో తన స్థానంపై అనుమానాలు వ్యక్తమయ్యానని, అప్పుడు తనలోని బెస్ట్ వర్షన్‌ను బయటకు తీయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. జట్టులో చోటు దక్కించుకోవడానికి ఊసరవెల్లిగా మారాల్సి వచ్చిందన్నాడు.‘తమిళనాడుజట్టులో ఓపెనర్‌గా వచ్చా. భారత్‌కు వచ్చే సరికి మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశా. గత ఐదేళ్లులో 6,7వ స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేశా.చోటు దక్కించుకోవడం నాకు పెద్ద సవాల్‌గా మారిందప్పుడు. ఆ ప్రయాణం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారడం నేర్చుకున్నాను.’అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. గతేడాది జూన్‌లో దినేశ్ కార్తీక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story