కపిల్ దేవ్, ధోనీలపై యువీ తండ్రి సంచలన ఆరోపణలు

by Harish |

భారత మాజీ కెప్టెన్లు ధోనీ, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీలపై మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.

కపిల్ దేవ్, ధోనీలపై యువీ తండ్రి సంచలన ఆరోపణలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై గతంలో ఇర్ఫాన్ పఠాన్ చేసిన ‘హుక్కా కామెంట్స్’ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ధోనీ కెప్టెన్సీలో తనకు అవకాశాలు దక్కలేదని, హుక్కా కొట్టేవాళ్లనే ధోనీ ఇష్టపడేవాడని అప్పట్లో ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ స్పందించాడు. మాజీ కెప్టెన్లు ధోనీ, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీలపై సంచలన ఆరోపణలు చేశాడు. వీరు ఆటగాళ్లపై దురుసుగా ప్రవర్తించే వారని ఆరోపించాడు. ‘బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎం.ఎస్ ధోనీ గురించి మాట్లాడాలి. నేను ఎవరితో ఉన్నానో వారి గురించే మాట్లాడగలను. వారు ఆటగాళ్లను హీనంగా చూసేవారు. అది చాలా తప్పు. రెండు తప్పులు ఒక్క దాని కరెక్ట్ చేయలేవు. మన కెప్టెన్ కారణంగా మన క్రికెటర్లు, జట్టు నాశనమైంది.’అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే, ధోనీపై పఠాన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఇది ఇర్ఫాన్ పఠాన్ గురించి మాత్రమే కాదు. గౌతమ్ గంభీర్ మాట్లాడటాన్ని చూశాం. వీరేంద్ర సెహ్వాగ్ బహిరంగంగానే చెప్పాడు. హర్భజన్ సింగ్ తనను ఈగల జట్టు నుంచి తొలగించారని చెప్పాడు. ధోనీ వీటికి సమాధానం చెప్పడు. సమాధానం చెప్పడానికి ఇష్టపడిన వ్యక్తికి తాను తప్పుచేశానని తన మనస్సాక్షికి తెలుసు.’అని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చాడు.


Next Story