ధోనీ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన దీపక్ చాహర్

by Dishanational3 |
ధోనీ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన దీపక్ చాహర్
X

దిశ, స్పోర్ట్స్ : ‘కొత్త సీజన్, కొత్త రోల్ కోసం ఎదురుచూస్తున్నాను.’ అని చెన్నయ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ పెట్టిన పోస్టు అభిమానులను కన్ఫ్యూజ్‌లో పడేసింది. దీంతో ధోనీ చేపట్టే కొత్త రోల్ ఏంటి?.. ఈ సీజన్‌లో ధోనీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి మెంటార్‌గా కొనసాగుతాడా? అన్న చర్చ జరిగింది. తాజాగా సీఎస్కే పేసర్ దీపక్ చాహర్ క్లారిటీ ఇచ్చాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్‌లో చాహర్ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో ధోనీ ఆడుతున్నాడని చెప్పాడు. అలాగే, అతను మరో రెండేళ్లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘టీ20ల్లో గంటకు 140 కిలో మీటర్ వేగంతో వచ్చే బంతిని వేగవంతమైనదిగా భావించినప్పుడు ఆటకు వీడ్కోలు పలుకుతారు. గత సీజన్‌లో గంటకు 145 కిలో మీటర్ల వేగంతో వచ్చిన బంతులను ధోనీ ఏ విధంగా సిక్స్‌లుగా కొట్టాడో చూశాం. నెట్స్‌లో మేము కూడా చూశాం.’అని చెప్పాడు. ధోనీ ఈ సీజన్ ఆడుతున్నాడని, ఈ సీజన్ తర్వాత అతను నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నట్టు తెలిపాడు.



Next Story

Most Viewed