- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MS Dhoni: నీ అవ్వ తగ్గేదే లే... సిక్సుల్లో ధోని సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) అరుదైన రికార్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా మరో రికార్డు నమోదు చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అవలీలగా సిక్సర్లు కొట్టే మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పటివరకు టి20 లలో 350 కి పైగా సిక్సర్లు కొట్టాడు.
ఇలా టి20 హిస్టరీలో 350 కి పైగా సిక్సర్లు కొట్టిన నాలుగవ భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు నమోదు చేశాడు మహేంద్ర సింగ్ ధోని. అంతకుముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే సూర్య కుమార్ యాదవ్ ఈ రికార్డును నమోదు చేసుకున్న ఇండియన్ ప్లేయర్లుగా... ఉన్నారు. అయితే ఈ ముగ్గురి తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాలుగవ స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని ఒక సిక్సర్ కొట్టాడు. దీంతో 350 సిక్సర్లు పూర్తయ్యాయి. కాగా ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది.
MS Dhoni becomes the fourth Indian to hit 350 sixes in T20 history 🇮🇳🏏Rohit Sharma, Virat Kohli, and Suryakumar Yadav are the first three Indians to achieve this milestone. 🔥#Cricket #MSDhoni #IPL2025 #Sportskeeda pic.twitter.com/O2UoraVZlk— Sportskeeda (@Sportskeeda) May 20, 2025






