ధోనీకి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ హాఫ్ ఫేమ్‌లో చోటు

by Harish |

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది.

ధోనీకి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ హాఫ్ ఫేమ్‌లో చోటు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌కు అతను చేసిన సేవలను ఐసీసీ గుర్తించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చింది. ఐసీసీ ఆల్ హాఫ్ ఫేమ్‌లో ఐసీసీ కొత్త ఏడుగురిని చేర్చింది. అందులో ధోనీ ఒకరు. మాథ్యూ హేడెన్(ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా(సౌతాఫ్రికా), గ్రేమ్ స్మిత్(సౌతాఫ్రికా), డేనియల్ వెట్టోరి(న్యూజిలాండ్)‌‌లకు చోటు దక్కగా.. ఇద్దరు మహిళా క్రికెటర్లు సనా మిర్(పాకిస్తాన్), సారా టేలర్(ఇంగ్లాండ్) స్థానం సంపాదించారు. భారత క్రికెట్‌కు ధోనీ విశేష కృషి చేశాడు. ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్(2011), చాంపియన్స్ ట్రోఫీ (2013) గెలిచింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్‌లు ఆడిన అతను 17,266 రన్స్ చేశాడు. అలాగే, 829 అవుట్‌లు చేశాడు. ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నా పేరు చేర్చడం నిజంగా గౌరవంగా ఉంది. ఆల్ టైం గ్రేట్స్‌తోపాటు మన పేరు ఉండటం అద్భుతమైన అనుభూతి. ఇది నేనెప్పటికీ ఆదరించే విషయం’అని ధోనీ తెలిపాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన 11వ భారత క్రికెటర్ ధోనీ. ధోనీకంటే ముందు నీతూ డేవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, డైన ఎడుల్జీ, వినో మన్కడ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్ ఈ గౌరవం పొందారు.


Next Story