- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధోనీకి షాకిచ్చిన సురేశ్ రైనా.. ఆల్ టైం వరల్డ్ ప్లేయింగ్ 11లో మాహీకి దక్కని చోటు
భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తాజాగా వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తాజాగా వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. రైనా తన జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు జట్టు కల్పించాడు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలను తీసుకున్నాడు. ఎం.ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడం గమనార్హం. ఓపెనర్లుగా సచిన్, బ్రియాన్ లారా(వెస్టిండీస్)ను తీసుకోగా.. వారితోపాటు టాపార్డర్‌లో విండీస్‌కు చెందిన వివియన్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్‌లకు స్థానం కల్పించాడు. ఆల్‌రౌండర్ కోటాలో యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ బోతమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లను ఎంచుకున్నాడు. ఇక, బౌలింగ్ విభాగంలో నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను తీసుకున్నారు. కుంబ్లే, షేన్ వార్న్(ఆస్ట్రేలియా), సక్లైన్ ముస్తాక్(పాకిస్తాన్)లకు చాన్స్ ఇవ్వగా.. సౌతాఫ్రికాకు చెందిన పాల్ ఆడమ్స్‌కు ఇంపాక్ట్ ప్లేయర్‌గా అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం రైనా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో ఇండియా చాంపియన్స్ ఆదివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చాంపియన్స్‌తో తలపడనుంది.
సురేశ్ రైనా వరల్డ్ ఎలెవన్ జట్టు : బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, వివియన్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, యువరాజ్ సింగ్, ఇయాన్ బోథమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్, షేన్ వార్న్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, సక్లైన్ ముస్తాక్, పాల్ ఆడమ్స్.






