- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర మహిళా క్రికెటర్లకు ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించింది. ఇటీవల జరిగిన ఎంపీసీఏ మేనేజింగ్ కమిటీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెటర్లకు రూ.12,500, దేశవాళీ ప్లేయర్లకు వివిధ కేటగిరీల్లో రూ.6 వేల నుంచి 10 వేల వరకు ప్రతి నెలా అందజేయనుంది. ఈ స్కీం మహిళల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లకు మాత్రమే వర్తించనుంది. అయితే, బీసీసీఐ నుంచి ఆర్థిక మద్దతు పొందని వారికే ఎంపీసీఏ నుంచి ఈ సహాయం లభించనుంది. ఈ స్కీం ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది.
అలాగే, మాజీ పురుషుల క్రికెటర్ల, అంపైర్ల పెన్షన్ పెంపునకు ఎంపీసీఏ ఆమోదం తెలిపింది. బీసీసీఐ పెన్షన్ స్కీంలో లేని మాజీ క్రికెటర్లు ఇకపై రూ. 7 వేలు(4 మ్యాచ్‌లు ఆడిన వారు), రూ.10 వేలు(5-14 మ్యాచ్‌లు), రూ.12,500(15-24 మ్యాచ్‌లు) అందుకోనున్నారు. బీసీసీఐ స్థాయి అంపైర్లు రూ.10 వేలు, రాష్ట్ర స్థాయి అంపైర్లు రూ.6,500 పొందనున్నారు. 75 ఏళ్ల పైబడిన వారికి అదనంగా మరో రూ.7,500 అందుతాయి. అలాగే, అంపైర్లు, స్కోరర్లు, సెలెక్టర్ల గౌరవ వేతనాలను కూడా ఎంపీసీఏ పెంచింది.






