ఇండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌...బీసీసీఐ కూడా దూరం !

by velandi.Saikiran |   (  Updated:2025-09-13 04:41:59  IST  )

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే రేపటి మ్యాచ్.. కు BCCI అధికారులు కూడా దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి

ఇండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌...బీసీసీఐ కూడా దూరం  !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య మ్యాచ్ జరగనుంది. ఆదివారం అంటే రేపటి రోజున... ఈ రెండు జట్లు తలపడతాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ లివ్ లో ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అలాగే ఇండియా... రెండు ఒక్కో మ్యాచ్ గెలిచి... మంచి ఊపులో కనిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ బై కాట్ (ind vs pak boycott ) చేయాలంటూ.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పహాల్గం సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ తో మ్యాచులు ఆడకూడదని భారతీయులు పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను కూడా ఎవరు కొనుగోలు చేయడం లేదట. ఇంకా 50 శాతం మంది టికెట్లు అన్ సోల్డ్‌ అయ్యాయని అంటున్నారు.

అయితే తాజాగా మరో న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే రేపటి మ్యాచ్.. కు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు కూడా దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ కు హాజరు కాకూడదని... నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఎవరు కూడా ఇంకా దుబాయ్ కి వెళ్లలేదట. కానీ కొంతమంది అధికారులు మాత్రం దుబాయ్ వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ మ్యాచ్ కు వెళ్తే ట్రోల్ చేస్తారని భయంతో చాలామంది ఇండియాలోనే ఉండిపోయారు.

Next Story