- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ వర్సెస్ పాక్ ఫైట్...మ్యాచ్ మధ్యలోనే లహోర్ పారిపోయిన నఖ్వీ !
భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్లు తేలిపోయారు. అయితే, పాక్ కు చెందిన సగం వికెట్లు పడగానే, నఖ్వీ పాకిస్తాన్ పారిపోయాడని వార్తలు వస్తున్నాయి.

Mohsin Naqvi ran away from the ground
దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ నిర్వహిస్తున్న ఈవెంట్స్ లో పాకిస్తాన్ పై మరోసారి భారత జట్టు పై చేయి సాధించింది. అసలు పాకిస్తాన్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుసగా విజయాలను నమోదు చేస్తోంది భారత జట్టు. టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ కూడా పాకిస్తాన్ జట్టును ఓడించింది భారత్. పాకిస్తాన్ పై ఏకంగా 61 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో వరుసగా మూడు విజయాలు నమోదు చేసుకున్న భారత్, సూపర్ 8 లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో పాక్ జట్టుకు భంగపాటు తప్పలేదు. ఈ లీగ్ దశలో మరో మ్యాచ్ గెలిస్తేనే, సూపర్ 8 ఛాన్స్ పాకిస్తాన్ కు ఉంటుంది.
మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన మొహ్సీన్ నఖ్వీ ?
టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో కొలంబో వేదికగా భారత జట్టుతో పాకిస్తాన్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట భారత జట్టు బ్యాటింగ్ చేయగా 175 పరుగులు సాధించింది. అయితే భారత్ విధించిన ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింద మీద పడింది పాకిస్తాన్. ఈ క్రమంలో పవర్ ప్లే ముగియక ముందు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. దీంతో అప్పటికే పాకిస్తాన్ ఓటమి ఖరారైంది. అసలు ఏ మాత్రం ఛాన్స్ కనిపించలేదు. అయితే ఈ విషయాన్ని గమనించిన మొహ్సీన్ నఖ్వీ ( Mohsin Naqvi ), వెంటనే కొలంబో స్టేడియం నుంచి వెళ్లిపోయారట. శ్రీలంక నుంచి నేరుగా లాహోర్ వెళ్లినట్లు తెలుస్తోంది.
సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ గెలవడం కష్టమేనని పీసీబీ అధ్యక్షుడు మొహ్సీన్ నఖ్వీ భావించారట. ఈ నేపథ్యంలోనే కొలంబో స్టేడియం నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లినట్లు ఇండియాకు సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా స్టార్లు పోస్ట్ లు పెడుతున్నారు. పాకిస్తాన్ ఓటమిని చూసి తట్టుకోలేక, మొహ్సీన్ నఖ్వీ వెళ్లిపోయాడని కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. హుటాహుటిన విమాన టికెట్ బుక్ చేసుకుని లహోర్ కు వెళ్లినట్లు మొహ్సీన్ నఖ్వీపై పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అయితే దీనిపై పాకిస్తాన్ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. మొహ్సీన్ నఖ్వీ ఎక్కడికి పారిపోలేదని.. హోటల్ గదికి మాత్రమే వెళ్లడని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కావాలనే మొహ్సీన్ నఖ్వీపై భారత ఫ్యాన్స్ దురద జల్లుతున్నారని మండిపడుతున్నారు. మొత్తానికి ఈ అంశం మాత్రం వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు, అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. ఏ మాత్రం పాకిస్తాన్ కు ఛాన్స్ ఇవ్వలేదు సూర్య భాయ్ టీమ్. ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 77 పరుగులతో రాణించగా, భారత బౌలర్లు తమ వంతు కృషి చేశారు. దీంతో పాకిస్తాన్ పై 61 పరుగుల తేడాతో భారత్ విక్టరీ దక్కించుకుంది. క్లిక్






