- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన మొహ్సిన్ నఖ్వీ
బీసీసీఐ, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మధ్య కొనసాగుతున్న వివాదం లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: బీసీసీఐ, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) మధ్య కొనసాగుతున్న వివాదం లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసియా కప్ ట్రోఫీ వివాదంలో.. ఐసీసీ కి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధం అయింది. ఈ క్రమంలో దిగొచ్చిన నఖ్వీ.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన అంశంపై స్పందిస్తూ.. “అలా జరగకూడదు, జరిగినదానికి క్షమించండి” అంటూ BCCI కి క్షమాపణలు తెలిపారు.
అయితే ట్రోఫీ, మెడల్స్ భారత్ జట్టుకు అప్పగించాలన్న BCCI డిమాండ్‌ను నఖ్వీ తిరస్కరించారు. ACC కార్యాలయానికి వచ్చి తీసుకుంటేనే ఇవ్వగలమని కొత్త షరతు విధించారని వార్తలు చెబుతున్నాయి. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై ACC సమావేశంలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసంతృప్తిగా ఉన్న BCCI ప్రతినిధులు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లడం గమనార్హం.
ఇక ఈ ఘటనపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వద్ద అధికారికంగా ఆవేదన వ్యక్తం చేయాలని యోచిస్తోంది. మరోవైపు, ఆటగాళ్లు సైతం ట్రోఫీ ఇవ్వకుండా అవమానకర పరిస్థితులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా, నఖ్వీ క్షమాపణలు చెప్పిన, ట్రోఫీ అప్పగించని ధోరణి ఈ వివాదాన్ని ముగించకుండా మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More: నఖ్వీ దూలతీర్చిన దూబే... నువ్వు ఇచ్చేది ఏంట్రా అంటూ !






