- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీసీ ర్యాంకింగ్స్.. 12 స్థానాలు ఎగబాకిన సిరాజ్.. ర్యాంక్ ఎంతంటే
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో... మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించిన

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొన్నటి వరకు జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో... మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. అతని కారణంగానే టీమిండియా గెలిచిందని.. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అంతటి స్థాయిలో పర్ఫామెన్స్ అందించాడు మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj). అయితే దానికి తగ్గట్టుగానే ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా మహమ్మద్ సిరాజ్ దూసుకు వెళ్తున్నాడు.
తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. ఏకంగా 12 స్థానాలు ఇక బాకిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 15వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐదవ టెస్టు నేపథ్యంలో ఏకంగా 674 పాయింట్లు సాధించాడు. తన కెరీర్ లో 674 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలాగే బుమ్రా ఇప్పటికీ కూడా మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. అతని స్థానంలో ప్రస్తుతం 889 పాయింట్లు ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో.. మూడు స్థానాలు వేగబాకి ఐదవ స్థానం దక్కించుకున్నాడు యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal).






