Test rankings :కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించిన సిరాజ్.. వారి స్థానాలు కూడా మెరుగు

by Harish |

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు.

Test rankings :కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించిన సిరాజ్.. వారి స్థానాలు కూడా మెరుగు
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో సిరాజ్ మూడు స్థానాలు ఎగబాకాడు. 15వ స్థానం నుంచి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే, అతను కెరీర్ బెస్ట్ రేటింగ్ 718 సాధించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 7 వికెట్లతో సత్తాచాటడంతోనే సిరాజ్ తాజాగా తన ర్యాంక్ను మెరుగుపర్చుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రాణించిన పలువురు భారత ప్లేయర్లు కూడా తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. జస్ప్రిత్ బుమ్రా నం. టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్నాడు. విండీస్‌పై అద్భుతమైన సెంచరీ చేసిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. 6 స్థానాలు అధిగమించి 25వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ విభాగంలో నం.1 స్థానం జడేజాదే. బ్యాటర్ కేఎల్ రాహుల్ నాలుగు స్థానాలు వెనక్కినెట్టి 35వ ర్యాంక్‌లో నిలిచాడు. మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో 4 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. తొలి మ్యాచ్‌లో సత్తాచాటిన భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.


Next Story