బీసీసీఐ నుంచి పిలుపు వస్తే, సూర్య ఫ్రాంక్ చేశాడని అనుకున్నా - సిరాజ్

by velandi.Saikiran |

సింపుల్ గా చెప్పాలంటే యూఎస్ఏపై టీమిండియా గెలిచిందనడానికి ముఖ్య కారణం మహమ్మద్ సిరాజ్.

బీసీసీఐ నుంచి పిలుపు వస్తే, సూర్య ఫ్రాంక్ చేశాడని అనుకున్నా  - సిరాజ్
X

దిశ‌, వెబ్ డెస్‌: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T 20 World Cup 2026) నేపథ్యంలో చివరి క్షణంలో స్థానం దక్కించుకున్నాడు హైదరాబాద్ స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj ). గౌతమ్ గంభీర్ ఏరుకోరి తెచ్చుకున్న హర్షిత్ రాణాకు (Harshit Rana ) గాయమైన నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. దానికి తగ్గట్టుగానే, శనివారం జరిగిన యూఎస్ఏ మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణించాడు మహమ్మద్ సిరాజ్. సింపుల్ గా చెప్పాలంటే యూఎస్ఏపై టీమిండియా గెలిచిందనడానికి ముఖ్య కారణం మహమ్మద్ సిరాజ్.

చివరి క్షణంలో జట్టులోకి వచ్చి అద్భుతం చేసిన సిరాజ్

టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా ఇవాళ భారత్, యూఎస్ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో యూఎస్ఏ జట్టు ముందు చిన్న లక్ష్యం ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్, బీసీసీఐ నమ్మకం పెట్టి అప్పగించిన డ్యూటీని ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్ లో యూఎస్ఏ జట్టుకు సంబంధించిన మూడు కీలక వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ సిరాజ్. మొత్తం నాలుగు ఓవర్లు సంధించిన మహమ్మద్ సిరాజ్, కేవలం 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 7.20 ఎకనామితో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో రియల్ హీరోగా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు. బ్యాటింగ్ లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ భారత జట్టును ఆదుకుంటే, బౌలింగ్ మాత్రం మహమ్మద్ సిరాజ్ తన సత్తా చాటాడు.

వరల్డ్ కప్ లోకి రావడం పై సిరాజ్ కామెంట్

చివరి క్షణంలో టీ20 వరల్డ్ కప్ జట్టులోకి రావడం పై మహమ్మద్ సిరాజ్ తాజాగా స్పందించారు. యూఎస్ఏ పై విజయం సాధించిన తర్వాత మహమ్మద్ సిరాజ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. అసలు వరల్డ్ కప్ జట్టులోకి వస్తానని నమ్మకం తనకు లేదని తెలిపారు. జట్టును ప్రకటించిన తర్వాత చివరి క్షణంలో తనకు ఫోన్ కాల్ వచ్చిందని వివరించారు మహమ్మద్ సిరాజ్. లగేజ్ మొత్తం రెడీ చేసుకో, టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చేసేయ్ అంటూ సూర్య భాయ్ ఫోన్ కాల్ చేసాడట. దీంతో సూర్య కుమార్ యాదవ్ చేసేది అంతా ఫ్రాంక్ అనుకోని లైట్ తీసుకున్నాడట మహమ్మద్ సిరాజ్. కానీ ఆ తర్వాత సూర్య భాయ్ గట్టిగా చెప్పడంతో నమ్మాడట మహమ్మద్ సిరాజ్. ఈ విషయాన్ని యూఎస్ఏ తో ( USA) మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత పంచుకున్నాడు మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్. కాగా టీ20 వరల్డ్ కప్ 2026 కోసం హర్షిత్ రాణా సెలెక్ట్ అయి.. ప్రాక్టీస్ చేసే క్రమంలో గాయపడ్డాడు. దీంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అటు వాషింగ్టన్ సుందర్ ( Sunder) పరిస్థితి కూడా ఇంకా క్లారిటీ లేదు.

Next Story