సిరాజ్ మియానా మజాకా .. ఒకే ఒక్క మ్యాచ్‌తో ఐసీసీ అవార్డు ఎగరేసుకపోయాడు

by Harish |

టీమిండియా ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌ను ఐసీసీ అవార్డు వరించింది.

సిరాజ్ మియానా మజాకా .. ఒకే ఒక్క మ్యాచ్‌తో ఐసీసీ అవార్డు ఎగరేసుకపోయాడు
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ సిరాజ్‌ను ఐసీసీ అవార్డు వరించింది. ఆగస్టు నెలకు సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఆగస్టులో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు. ఆ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా సిరీస్‌ను 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. టీమిండియాను సిరీస్ ఓటమి నుంచి బయటపడేయడంలో సిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. ఐదో టెస్టులో అదిరే ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ విజయం దిశగా వెళ్తున్న సమయంలో సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌లో ఆ జట్టును కట్టడి చేశాడు. మ్యాచ్‌లో ఆఖరి రోజు సిరాజ్ రాణించకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

అందుకే ఆగస్టులో ఒక్క మ్యాచే ఆడినప్పటికీ అతని ప్రదర్శన ఆధారంగా ఐసీసీ సిరాజ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, విండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ పోటీపడగా వారిని వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, విండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ పోటీపడగా వారిని వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలవడం సిరాజ్‌కు ఇదే మొదటిసారి. మొత్తంగా ఐదు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ 23 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

మరింత కష్టపడతా : సిరాజ్

ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు దక్కడంపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత జెర్సీ ధరించిన ప్రతిసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని, భవిష్యత్తులోనూ మరింత కష్టపడతానని చెప్పాడు. ‘ఐసీసీ అవార్డుకు ఎంపిక కావడం నాకు ప్రత్యేక గౌరవం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఒక చిరస్మరణీయ సిరీస్. కీలకమైన వికెట్లు తీసి జట్టుకు దోహదపడినందుకు గర్వంగా ఫీలవుతున్నా. ఇంగ్లాండ్ టాప్ బ్యాటింగ్ లైనప్‌‌కు బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. కానీ, అదే నాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసుకొచ్చింది. ఈ అవార్డు నా సహచరులు, సపోర్టింగ్ స్టాఫ్‌కు కూడా చెందుతుంది. వారి నమ్మకం, ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది.’అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.


Next Story