- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో ఇఫ్తార్ విందు..పాల్గొన్న ఒవైసీ, సిరాజ్
హైదరాబాద్ లోని ఓల్డ్ ఈద్గా గ్రౌండ్ ఫస్ట్ లాన్సర్‌లో ఇఫార్ విందు జరిగింది. ఇందులో సిరాజ్, ఒవైసీ హజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇఫ్తార్ విందులు ( Dawat E Iftar) కూడా చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోని మజీదులలో కూడా ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్నారు. ఈ ఇఫ్తార్ విందులలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (MP Asaduddin Owaisi), భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj) కూడా పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో భారత క్రికెటర్
హైదరాబాద్ లోని ( Hyderabad ) ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ ఈద్గా గ్రౌండ్ లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, మహమ్మద్ సిరాజ్ కూడా పాల్గొన్నారు. ముస్లిం సాంప్రదాయ బట్టల్లో ఈ ఇద్దరు స్టార్లు పాల్గొని, ఉపవాసాలు విరమించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా మొన్నటి వరకు టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో బిజీగా గడిపాడు మహమ్మద్ సిరాజ్. త్వరలోనే ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. అందులో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రతిరోజు హైదరాబాద్ లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు సిరాజ్. ఇక తాజాగా ఇఫ్తార్ విందులో పాల్గొని సందడి చేశాడు.






