SRH: మహమ్మద్ షమీకి బిగ్ షాక్..!

by velandi.Saikiran |   (  Updated:2025-05-26 15:15:39  IST  )

సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) జట్టు స్టార్ ఆటగాడు మహమ్మద్ షమీకి ( Mohammed Shami ) ఊహించని ఎదురు దెబ్బ

SRH: మహమ్మద్ షమీకి బిగ్ షాక్..!
X

దిశ, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) జట్టు స్టార్ ఆటగాడు మహమ్మద్ షమీకి ( Mohammed Shami ) ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 ( IPL 2026) అంటే వచ్చే సీజన్ లో షమీని వదులుకోవాలని కావ్య మారన్ ( Kavya Maran) నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భువనేశ్వర్ ( Bhuvaneshwa kumar) స్థానంలో ఏరి కోరి మరి మహమ్మద్ షమీని కొనుగోలు చేసింది హైదరాబాద్ యాజమాన్యం.

అయితే మహమ్మద్ షమీని కొనుగోలు చేసిన తర్వాత.. రిజల్ట్ మాత్రం చాలా పేలవంగా వచ్చింది. మహమ్మద్ షమీ పెద్దగా రాణించడం లేదు. భువనేశ్వర్ కుమార్ జట్టులో ఉంటే హైదరాబాద్ కచ్చితంగా గెలిచేది. కానీ మహమ్మద్ షమీ వచ్చిన తర్వాత... హైదరాబాద్ బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. SRH బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పటికీ బౌలింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. బౌలింగ్ లో ఎంతమందిని మార్చిన కూడా పరిస్థితి అదేలా కనిపించింది.

అందుకే మహమ్మద్ షమీపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట. అయితే ఈ వార్తలు బయటకు రాగానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ వెటోరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్ లో పేలవంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ షమీ మళ్లీ పుంజుకుంటాడని.. ఆయన చెప్పుకొచ్చారు. తర్వాతి సీజన్ లో కచ్చితంగా మహమ్మద్ షమీ దుమ్ము లేపుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story