దుమ్ములేపిన మహమ్మద్ సిరాజ్.. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వెస్టిండీస్

by Kema Shiva Kumar |

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌ (West Indies)తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు.

దుమ్ములేపిన మహమ్మద్ సిరాజ్.. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వెస్టిండీస్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌ (West Indies)తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ (Roston Chase) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఓపెనర్లలో తంగెనరైన్ చందర్‌పాల్, మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌలింగ్‌ కీపర్ ధృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తరువాత మరో ఓపెనర్ జాన్ క్యాంబెల్ 19 బంతుల్లో 8 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చేతికి చిక్కాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన అలిక్ అథనాజ్‌ 15 బంతుల్లో 13 పరుగులు చేసి ధాటిగా ఆడే ప్రయత్నంలో సిరాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో బ్యాట్స్‌మెన్ బ్రండన్ కింగ్ 25 బంతుల్లో 11 పరుగులు చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 21 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 4 కీలక వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. కెప్టెన్ రోస్టన్ చేజ్ 29 బంతుల్లో 15 పరుగులు, షాయ్ హోప్ 29 బంతుల్లో 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Next Story