Mohammad Rizwan : ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు.. వరల్డ్ రికార్డు సమం చేసిన రిజ్వాన్

by Sathputhe Rajesh |

పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు ఒడిసిపట్టిన తొమ్మిదవ వికెట్ కీపర్‌గా వరల్డ్ రికార్డును సమం చేశాడు.

Mohammad Rizwan : ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు.. వరల్డ్ రికార్డు సమం చేసిన రిజ్వాన్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు ఒడిసిపట్టిన తొమ్మిదవ వికెట్ కీపర్‌గా వరల్డ్ రికార్డును సమం చేశాడు. శుక్రవారం అడిలైడ్‌ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఏడుగురు ఆస్ట్రేలియా ప్లేయర్లు క్యాచ్ ఔట్ అవగా అందులో ఆరు క్యాచ్‌లను రిజ్వాన్ అందుకోగా ఒక క్యాచ్‌ను బాబర్ ఆజమ్ అందుకున్నాడు. రిజ్వాన్ ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు అందుకున్న 12వ ప్లేయర్‌గా నిలిచాడు. అంతుకుముందు క్వింటన్ డికాక్, సర్ఫరాజ్ అహ్మద్, జాస్ బట్లర్, ఆడమ్ గిల్ క్రిస్ట్ ఈ ఫీట్‌ను అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాకిస్తాన్ ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్నితేల్చే డిసైడర్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. 1996 తర్వాత పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలవడం ద్వారా చరిత్రను తిరగరాసింది.

Next Story