- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిల్ స్థానంలో అతనికి కెప్టెన్సీ ఇవ్వండి..మహ్మద్ కైఫ్ సంచలనం !
గిల్ స్థానంలో వన్డే కెప్టెన్సీ తాత్కాలికంగా కే ఎల్ రాహుల్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు మహ్మద్ కైఫ్.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ( Mohd Kaif ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గిల్ స్థానంలో వన్డే కెప్టెన్సీ తాత్కాలికంగా కే ఎల్ రాహుల్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు మహ్మద్ కైఫ్. గాయం కారణంగా గిల్ తప్పుకున్నాడు కాబట్టి, కే ఎల్ రాహుల్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ ఎలాగో ఇవ్వరు, కాబట్టి దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరగబోయే వన్డే సిరీస్ కోసం కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
టీమిండియాను లీడ్ చేయగల సత్తా కేఎల్ రాహుల్ కు ఉందని, గతంలో కూడా అతడు జట్టును నడిపించాడని గుర్తు చేశారు. దీంతో మహ్మద్ కైఫ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా మెడనొప్పి బారిన పడ్డాడు ప్రిన్స్ గిల్. దీంతో రెండో టెస్టుకు ఇప్పటికే దూరం కాగా, దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి కూడా అతడు తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే కెప్టెన్సీ ఎవరికీ ఇవ్వాలి అనేదానిపైన చర్చ జరుగుతోంది.






