- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజారుద్దీన్‌కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్‌కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్‌ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్‌కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు.
Next Story






