- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. వసీం అక్రమ్ రికార్డ్ బ్రేక్
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 19 ఓవర్లు బౌలింగ్ చేసి..

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్ లో 19 ఓవర్లు బౌలింగ్ చేసి.. 71 పరుగులు ఇచ్చిన మిచెల్.. ఆరు వికెట్లు తీసి చెలరేగాడు. టెస్టు క్రికెట్లో వరుసగా మూడు మ్యాచుల్లో ఆరేసి వికెట్లు తీసిన తొలి ఆసీస్ పేసర్ గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. పాక్ మాజీ బౌలర్ వసీమ్ అక్రమ్ టెస్టు క్రికెట్ హిస్టరీలో 414 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ అతడి రికార్డును బ్రేక్ చేశాడు. 415 వికెట్లు తీసిన ఎడమచేతివాటం కలిగిన పేసర్ గా రికార్డుకెక్కాడు. స్టార్క్ ఇప్పుడు ఆల్-టైమ్ వికెట్-టేకర్ల జాబితాలో 16వ స్థానంలో ఉన్నాడు.
నవంబర్లో పెర్త్ లో ఇంగ్లాండ్ తో జరిగిన యాషెస్ ఫస్ట్ టెస్ట్ ఇన్నింగ్స్ లో 58 రన్స్ ఇచ్చి.. 7 వికెట్లు తీశాడు. ఈ ఏడాది జులైలో వెస్టిండీస్ తో జరిగిన థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 9 పరుగులు ఇచ్చిన మిచెల్.. 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో 6, అంతకంటే ఎక్కువ వికెటలు తీసిన తొలి బౌలర్ గా టామ్ రిచర్డ్ సన్ ఉన్నాడు. 1895లో అతను మెల్ బోర్న్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో 104 రన్స్ కు 6 వికెట్లు తీశాడు. లార్డ్స్, మాంచెస్టర్లో జరిగిన మ్యాచుల్లోనూ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6, 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. 1982-83 లో భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ మ్యాచుల్లో పాక్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ రికార్డును సాధించాడు.






