- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ,స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. యూపీ వారియర్స్ చేతిలో మరోసారి ఆ జట్టు చిత్తయ్యింది. నవీ ముంబైలో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో యూపీ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీనే గెలిచిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ యూపీ అదరగొట్టింది. ముందుగా ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మెగ్ లాన్నింగ్(70) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా.. లిచ్‌ఫీల్డ్(61) కూడా మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. అనంతరం ఛేదనకు దిగిన ముంబైని యూపీ బౌలర్లు కట్టడి చేశారు. ఎంఐ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసింది. హేలీ మాథ్యూస్(13), సజీవన్ సజన(10), నాట్ స్కివర్ బ్రంట్(15), కెప్టెన్ హర్మన్‌ప్రీత్(18), నికోలా కారీ(6) నిరాశపర్చడంతో ముంబై తీవ్రంగా తడబడింది. అమేలియా కెర్(49 నాటౌట్), అమన్‌జోత్ కౌర్(41) పోరాటంతో ఆ జట్టు 165 పరుగులైనా చేయగలిగింది. లేదంటే భారీ ఓటమిని మూటగట్టుకునేది. యూపీకి ఇది వరుసగా రెండో విజయం.






