రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ డిన్న‌ర్, మెస్సి సండే షెడ్యూల్ ఇదే

by velandi.Saikiran |

ఫలక్ నుమా ప్యాలెస్ లో బస, డిన్నర్ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆదివారం ఉదయం స్పెషల్ ఫ్లైట్ లో ముంబై

రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ డిన్న‌ర్, మెస్సి సండే షెడ్యూల్ ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్ : లియోనెల్ మెస్సి ఇండియా టూర్ కొన‌సాగుతోంది. శ‌నివారం ఉద‌యం ఇండియాలో లాంచ్ అయిన లియోనెల్ మెస్సి, దాదాపు మూడు రోజుల పాటు భార‌త్ లో ప‌ర్య‌టిస్తారు. శ‌నివారం ఉద‌యం కోల్ క‌తాలో దిగిన లియోనెల్ మెస్సి, సాయంత్రం హైద‌రాబాద్ లో సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్ కూడా ఆడారు.

ఇక ఈ మ్యాచ్ పూర్తి కాగానే, ఫలక్ నుమా ప్యాలెస్ చేరుకున్నారు. శ‌నివారం రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ లో డిన్న‌ర్ లో పాల్గొని, రాత్రి హైద‌రాబాద్ లోనే బ‌స చేయ‌నున్నారు మెస్సి. ఈ మేర‌కు ఫలక్ నుమా ప్యాలెస్ లో బస, డిన్నర్ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆదివారం ఉదయం స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లనుంది లియోనెల్ మెస్సి బృందం. ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లనున్నారు. ఈ లెక్క‌న ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి ఉద‌యం 9.30 గంట‌ల‌కు బయలు దేరనున్నారు మెస్సి.

Next Story