- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జకోవిచ్‌ను మట్టికరిపించిన 19 ఏళ్ల కుర్రాడు
కెరీర్‌లో 100వ టైటిల్ దక్కించుకోవాలని చూసిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్(సెర్బియా)కు మియామి ఓపెన్‌లో నిరాశే ఎదురైంది.

దిశ, స్పోర్ట్స్ : కెరీర్‌లో 100వ టైటిల్ దక్కించుకోవాలని చూసిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్(సెర్బియా)కు మియామి ఓపెన్‌లో నిరాశే ఎదురైంది. ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్ యువ సంచలనం, 19 ఏళ్ల జాకబ్ మెన్సిక్ చేతిలో అతను చిత్తయ్యాడు. ఫ్లోరిడాలో జరిగిన టైటిల్ పోరులో మెన్సిక్ 7-6(7-4), 7-6(7-4) తేడాతో జకోకు షాకిచ్చి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మెన్సిక్‌కు విజయం అంత తేలికగా దక్కలేదు. 2 గంటలకుపైగా జకోతో పోరాడాడు. జకో నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థి దిగ్గజ ప్లేయర్ అయినప్పటికీ అతను ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిలబడ్డాడు. రెండు సెట్లు ట్రై బ్రేకర్‌కు వెళ్లాయంటే ఇద్దరి మధ్య పోరు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మెన్సిక్‌కు ఇదే తొలి ఏటీపీ టూర్ టైటిల్. అలాగే, మియామి ఓపెన్ విజేతగా నిలిచిన రెండో యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. మొదటి యంగెస్ట్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్). 18 ఏళ్ల వయసులో అతను 2022లో టైటిల్ గెలిచాడు. ఇప్పటివరకు 99 టైటిల్స్‌తో జకో అత్యధిక సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు జిమ్మీ కాన్నర్స్, రోజర్ ఫెదరర్ మాత్రమే 100 టైటిల్స్ సాధించారు.






