- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెహదీ హసన్, కేథరీన్ బ్రైస్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ వీళ్లకే!
by Phanindra |
బంగ్లాదేశ్ స్టార్ మెహదీ హసన్, స్కాట్లాండ్ కెప్టెన్ కేథరీన్ బ్రైస్‌కు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది.

X
దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్, స్కాట్లాండ్ మహిళా క్రికెటర్ కేథరీన్ బ్రైస్‌కు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులు దక్కాయి. జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీసులో మెహదీ హసన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రెండో టెస్టులో బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ఐదు వికెట్లు తీసుకోవడంతోపాటు, సెంచరీతో చెలరేగాడు.
అదరగొట్టిన కేథరీన్..
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 క్వాలిఫైయర్స్‌లో స్కాట్లాండ్ కెప్టెన్ కేథరీన్ బ్రైస్ అదగొట్టింది. బ్యాటుతో ఐదు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక శతకం సాయంతో 293 పరుగులు చేసింది. అలాగే ఆరు వికెట్లు కూడా తీసుకుంది. అయితే ఆమె అద్భతుంగా రాణించినా ఈ ఏడాది జరిగే మహిళల ప్రపంచకప్‌కు స్కాట్లాండ్ క్వాలిఫై అవ్వకపోవడం దురదృష్టకరం.
Next Story






