గంభీర్ పై వేటు.. టీమిండియాకు కొత్త కోచ్ వ‌స్తున్నాడు ?

by velandi.Saikiran |

సాయిను పక్కకు పెట్టడం, అదే సమయంలో గిల్ కు గాయం కావడంతో భార‌త్‌ ఓడిపోయింది. దీంతో వెంటనే గౌతమ్ గంభీర్‌ను కోచ్‌ పదవి

గంభీర్ పై వేటు.. టీమిండియాకు కొత్త కోచ్ వ‌స్తున్నాడు ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భార‌త్‌ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో జరిగిన మొదటి టెస్ట్ లో భార‌త్‌ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్స్ లాంటి సొంత గడ్డపై కూడా భార‌త్‌ తేలిపోయింది. దీంతో భార‌త హెడ్ కోచింగ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మూడో స్థానంలో సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకుంటే ఇవాళ టీమిండియా ఓడిపోయే పరిస్థితి రాకపోయదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనవసరంగా సాయి సుదర్శన్ ను పక్కకు పెట్టడం, అదే సమయంలో గిల్ కు గాయం కావడంతో భార‌త్‌ ఓడిపోయింది. దీంతో వెంటనే గౌతమ్ గంభీర్‌ను కోచ్‌ పదవి నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. భార‌త జ‌ట్టును సర్వనాశనం చేస్తున్నాడని అభిమానులు సైతం నిప్పులు చెరుగుతున్నారు. గంభీర్‌ వెంటనే తొలగించి వీవీఎస్ లక్ష్మణ్ ను హెడ్ కోచ్ గా నియామకం చేయాలని డిమాండ్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story